రాష్ట్రంలో ఎగిరిన ‘బీసీ’ బావుట.. TRP స్టేట్ కమిటీ ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-17 10:54:46  IST  )

తెలంగాణ పాలిటిక్స్‌లో మరో కొత్త పొలిటికల్ పార్టీ పురుడు పోసుకుంది.

రాష్ట్రంలో ఎగిరిన ‘బీసీ’ బావుట.. TRP స్టేట్ కమిటీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ పురుడు పోసుకుంది. ఇవాళ బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (TRP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అదేవిధంగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న వ్యహరించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్‌లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యా రావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్ వ్యహరించారు. పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా స్థానం కల్పిస్తామని వారంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. మిగతా విభాగాలకు సంబంధించి కార్యవర్గాలను త్వరలోనే ఎన్నుకుని ప్రకటిస్తామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

Next Story