- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తిన కనుసన్నల్లో భాగ్యనగర సమరం: గ్రేటర్ బీజేపీలో ‘లోకల్’ నేతలకు చెక్?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో కుస్తీ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో కనీసం ఒక్కటైనా పూర్తి మెజార్టీతో దక్కించుకుని పార్టీ పరువును కాపాడుకునేందుకు కమలనాథులు కుస్తీ పడుతున్నారు. గతంలో వచ్చి ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. ముందుగా పార్టీని ఏవిధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలో సీనియర్లు వ్యుహాలకు పదును పెడుతున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. అలాంటి ఫలితాలు రాకుండా ముందుస్తు ప్లాన్చేస్తూ 300 డివిజన్ల పార్టీ పరిస్థితిపై రిపోర్టు హస్తిన పెద్దలు తెప్పించుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ఎన్నికల వ్యవహారమంతా ఢిల్లీ పెద్దల కనుసన్నలో నడువనుంది. గడిచిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బాధ్యతలు తీసుకొని కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సరళి అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి అధికార బీఆర్ఎస్‌కు ధీటుగా సీట్లు సాధించి పార్టీ బలం నిరూపించారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనూ 120 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. జిల్లాలో పార్టీ అంతంత మాత్రమే ఉండగా మహానగరంలో కొద్దిగా బలం ఉండటంతో రెండో స్థానంలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో పార్టీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఉండటంతో పాతబస్తీ చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. ప్రస్తుతం రాజాసింగ్పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి పార్టీలో నెలకొంది. ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకరావాలని నగరానికి చెందిన సీనియర్ల నేతలు పార్టీపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కొందరు సీనియర్ల మాత్రం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ గెలవకున్నా ఫర్వాలేదు రాజాసింగ్రాకుండా అడ్డుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్గెలుపు బాధ్యతలు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్రావు అప్పగించాలని పార్టీ భావించిన వీరితో గెలుపు సులువు కాదని, కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రతిపాదనలు చేస్తున్నారు. సీనియర్లు పాత వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం తప్ప కొత్తవారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక పక్క అధికార కాంగ్రెస్, మరో వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్ధం చేశాయి. ఎన్నికల నగారా మోగడమే ఆలస్యం వారంతా ప్రచారంలో పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీలో ఇప్పటివరకు సగం సీట్లకు బలమైన అభ్యర్థులు దొరకడం లేదని పార్టీలో టాక్వినిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకరంటే ఒకరికి గిట్టని వాతావరణ నెలకొంది. ఒక గ్రూపునకు సీట్లు ఎక్కువ ఇస్తే మరో గ్రూపు నేతలు ఓడించేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక నేతలకు చెక్..
హైకమాండ్సర్వేలు చేయించి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైన నేతలకే టికెట్లు ఇచ్చేలా ప్లాన్చేస్తోంది. సీనియర్ల సిఫారసులు పక్కన పెట్టాలని నిర్ణయించింది. గతంలో వారు చెప్పిన వారికి ఇస్తే ఓటమి ఎదురైందని, ప్రజాబలమున్న నేతలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. గతంలో పార్టీని నడిపిన నేతలకు ప్రచారంలో జెండాలు మోయడం తప్ప ఎలాంటి కీలకమైన బాధ్యతలు ఇవ్వడం లేదని చర్చ జరుగుతోంది. ప్రతి ఎన్నికల సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సహాయం అందిస్తే వారికి ఇవ్వకుండా సీనియర్లే తమ ఖాతాలో వేసుకున్నట్లు హస్తిన పెద్దల పరిశీలనలో తేలింది. ఈసారి ఎన్నికలో ఢిల్లీ పెద్దలు ఎవరికి ఏ సహాయం చేసినా వారి చేతితోనే చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక నేతల దోపిడీకి చెక్పెట్టేందుకు సిద్ధమైంది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో ముగ్గురు కేంద్ర సహాయ మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించే అవకాశం ఉంది.
రంగంలోకి హైకమాండ్
రాష్ట్ర బీజేపీలో రెండేళ్లుగా గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ఒకరికి బాధ్యతలు ఇస్తే మరొకరి నచ్చడం లేదు. అందుకోసం వారికి సహకరించకుండా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. దీంతో పార్టీ పరువు బజారున పడుతోంది. ఈ సారి జరిగే మహానగర పోరులో ఎవరి బాధ్యతలు వారికే అప్పగించనున్నారు. ఎక్కడైనా పార్టీకి ఇబ్బంది పెట్టే పనులకు పాల్పడితే వేటు వేసేందుకు నడుంబిగించింది. ముందుగా అందరితో సమావేశం ఏర్పాటు చేసి వివాదాలు ఉంటే పరిష్కరం చూపనుంది. అయినా పార్టీ ఓటమికి కారణమైతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించనుంది.






