అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు.. వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-26 06:56:33  IST  )

అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిసిందే.

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిసిందే. అవసరాలకు లోన్ తీసుకోగానే సరిపోదు.. ఆ అప్పును సరైన సమయంలో చెల్లించాలి. లేదంటే బ్యాంకు అధికారులు, రుణ దాతలు వెంటబడుతుంటారు. అందుకే రుణం సకాలంలో చెల్లించాలని బ్యాంకు వారు పదే పదే చెబుతుంటారు. తాజాగా అప్పు చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఏకంగా ఓ ఇంటికి ముందు పొయ్యి పెట్టి వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఘటన జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం పెదతండాలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే.. తండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకుంది. ఈ అప్పు ఇప్పుడు రూ.61 వేలు అయింది. అప్పు కట్టాలని బ్యాంకు అధికారులు గతంలోనే చాలాసార్లు గుగులోత్ లక్ష్మికి చెప్పారు. అయినా లక్ష్మి నిర్లక్ష్యం వహించటంతో బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డి, సీసీ సోమనారాయణ, వీవోఏలు రుణం వసూలు కోసం గుగులోత్‌ లక్ష్మి ఇంటి ముందు వంటావార్పు చేపడతామని పొయ్యి పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story