నాంపల్లి అగ్నిప్రమాదం.. ఆఖరి క్షణాల్లో ఇంతియాజ్ ఆర్తనాదాలు: కన్నీళ్లు పెట్టిస్తున్న ఆడియో

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-30 11:22:11  IST  )

నాంపల్లి అగ్నిప్రమాదంతో ఆఖరి క్షణాల్లో ఇంతియాజ్ చేసిన ఆర్తనాదాల ఆడియో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి...

నాంపల్లి అగ్నిప్రమాదం.. ఆఖరి క్షణాల్లో ఇంతియాజ్ ఆర్తనాదాలు: కన్నీళ్లు పెట్టిస్తున్న ఆడియో
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాంపల్లి(Hyderabad Nampally) బచ్చాస్ ఫర్నీచర్ షాపు(Bachcha Furniture Shop)లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(Fire Accident)లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో చిక్కుకుని మృతి చెందిన ఇంతియా అనే వ్యక్తి చివరి క్షణాల్లో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. షాపు సెల్లార్‌లో చిక్కుకున్న అతని ఫ్యామిలీని కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఆడియోలో వింటే కన్నీళ్లు ఆగడం లేదు. సెల్లార్‌లో తనతో పాటు ముగ్గురు పిల్లలు చిక్కుకుపోయారని బయటకు వాళ్లకు ఇంతియాజ్ ఫోన్ చేశారు. సెల్లార్‌లోని వెనుక డోర్ వేసి ఉందని, వెంటనే తీయాలని, తాము చనిపోయే పరిస్థితుల్లో ఉన్నామని, తమను కాపాడాలని ఇంతియాజ్ ఆర్తనాదాలు చేశారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది. ఈ ఆడియోలో తన చివరి క్షణాల్లో ఇంతియాజ్ చేసిన ప్రయత్నాన్ని విని కన్నీరు పెట్టుకుంటున్నారు.

Next Story