- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాపై పక్కా ప్లాన్‌తోనే హత్యాయత్నం చేశారు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
తనపై పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం చేశారంటూ బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఆయన పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కూడా తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నారని కౌశిక్ రెడ్డి అనడంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ నేతనే విమర్శిస్తారా అంటూ బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు కేటాయించిన ప్రభుత్వ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లి కారును, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
ఈ దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కై పక్కా ప్లాన్‌తోనే తనపై హత్యాయత్నం చేయించారని విమర్శించారు. ‘బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకే నేను సమాధానం ఇచ్చాను. కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని నేను ముందే చెప్పాను. నాపై రెక్కీ నిర్వహిస్తున్నారని, నన్ను చంపే అవకాశం ఉందని అధికారులను హెచ్చరించాను’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో తనపై దాడికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌కు గన్ కల్చర్ తీసుకురావడం సరైన పద్ధతి కాదని, దొంగలను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారని మండిపడ్డారు. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పడమే నేను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఈ ఘటనతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటేననే నిజం బయటపడిందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.






