అట్టహాసంగా సారక్క ఆగమనం.. పూజారుల నృత్యాలు, పూనకాలతో దద్దరిల్లిన మేడారం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-28 17:13:01  IST  )

మేడారం గద్దెపైకి సారక్క చేరుకుంది. గిరిజన ఆచారాల సాక్షిగా, లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెను చేరింది. కన్నెపల్లి గ్రామం నుండి డప్పుల దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల మధ్య గద్దెలపై కొలువుదీరింది.

అట్టహాసంగా సారక్క ఆగమనం.. పూజారుల నృత్యాలు, పూనకాలతో దద్దరిల్లిన మేడారం
X

దిశ, నెట్వర్క్: మేడారం గద్దెపైకి సారక్క చేరుకుంది. గిరిజన ఆచారాల సాక్షిగా, లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెను చేరింది. కన్నెపల్లి గ్రామం నుండి డప్పుల దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల మధ్య గద్దెలపై కొలువుదీరింది. సారక్క భర్త గోవింద రాజు కొండాయి నుండి, సమ్మక్క భర్త పగిడిద్ద రాజు పూను గోండ్ల నుండి మేడారానికి విచ్చేసిన సంగతి తెలిసిందే.

కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు..

మేడారం జాతర నేపథ్యంలో సారక్క గద్దెనెక్కుతున్న క్రమంలో అధికారులు భారీ కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు ఎదురుచూస్తుండటంతో మేడారం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. సారక్క ఆగమనం జరుగుతున్న క్రమంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాలు కొనసాగించారు.








Next Story