నెట్‍ఫ్లిక్స్ తో నా కల నిజం కాబోతోంది: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2026-03-12 12:05:29  IST  )

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

నెట్‍ఫ్లిక్స్ తో నా కల నిజం కాబోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆకస్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‍కు తీసుకు వచ్చారన్నారు.

భూమి ఇచ్చేందుకు రెడీ:

నెట్ ఫ్లిక్స్ కు ఇది దేశంలోనే రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. మా దృష్టి హాలివుడ్ పైననే అని నేను గతం లోనే చెప్పాను. నెట్ ఫ్లిక్స్ తో నా కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం. మీ విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణలో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు.

మూసీ ప్రాజెక్ట్ వివాదం.. సీఎం సమావేశంపై ఘంటా చక్రపాణి ట్వీట్ వైరల్

Next Story