- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagga Reddy : నిన్ను కేసీఆర్ అందుకే వెళ్లగొట్టాడు : ఈటలపై జగ్గారెడ్డి ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eetala Rajendar)కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy)కి మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eetala Rajendar)కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy)కి మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ (Congress Party) గురించి ఈటల రాజేందర్ ఇష్టానుసారంగా మాట్లాడితే.. నడిరోడ్డుపై బట్టలిప్పి గుంజీలు తీయిస్తానని జగ్గారెడ్డి అనగా.. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తాను కొట్లాడితే.. ధీరుడితో కొట్లాడుతానే తప్ప రండలతో ఏం కొట్లాడను అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈటల వ్యాఖ్యలపై మరోసారి విరుచుకు పడ్డారు జగ్గారెడ్డి. ఈటల రాజేందర్ ఇక్కడితో ఆపాలని, లేకుంటే నీ పరువు నువ్వే తీసుకున్నవాడివి అవుతావని మండిపడ్డారు. నీ నస తట్టుకోలేకే కేసీఆర్(KCR) పార్టీ నుంచి వెళ్లగొట్టాడని మరో బాంబ్ పేల్చారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ని ఈటల రాజేందర్ తట్టుకోలేరని.. తాను మంచివాళ్లకు మంచోడిని..చెడ్డవాళ్లకు చెడ్డోడిని వెల్లడించారు.
ఇక ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్ ఇందిరా గాంధీ(Indira Gandhi)ని గుర్తుచేస్తోందన్నారు. నాడు ఇందిరా గాంధీని ప్రపంచం మెచ్చుకుందని గుర్తు చేసుకున్నారు. ఇందిరా కూడా ప్రతిపక్షంతో విమర్శలు లేకుండా యుద్ధం చేశారని తెలిపారు. అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసిందని, యుద్ధంలో తలదూర్చొద్దని అప్పట్లో అమెరికాను ఇందిరమ్మ హెచ్చరించారన్నారు. తప్పని పరిస్థితిలో అప్పటి పాక్ ప్రధాని ఇందిరకు తలవంచారని, ఇందిరాగాంధీని వాజ్‌పేయి అపరకాళీ అని ప్రశంసించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.






