Dynamic News: అది ఎన్టీఆర్ జనతా గ్యారేజ్.. ఇది కేసీఆర్ జనతా గ్యారేజ్

by Bhoopathi Nagaiah |

తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్‌ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Dynamic News: అది ఎన్టీఆర్ జనతా గ్యారేజ్.. ఇది కేసీఆర్ జనతా గ్యారేజ్
X

తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్‌ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజీలా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు కీలక వ్యా్ఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిది రాజకీయ హత్యగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన వైసీపీ మండల స్థాయి నేత పరారీలో ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వీరయ్య చౌదరి హత్యను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కరుడుగట్టిన నేరస్తులు కూడా చేయని విధంగా హత్య చేశారని చెప్పారు. వీరయ్య ఒంటిపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా ఘోరమైన వ్యక్తులు ఉన్నారా అనిపిస్తుందన్నారు. అనంతరం చంద్రబాబు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో రెయిడ్ చేశారు. సుల్తానాబాద్ ఎస్సారెస్పీ డివిజన్ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేశ్‌లు రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఇజాజ్ సిక్ లీవ్ పెట్టగా.. ధ్రువీకరించేందుకు రూ.20వేల లంచం డిమాండ్ చేశారు. ఈ కక్కుర్తి అధికారుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

జమ్మూకశ్మీర్‌లోని పహెల్గంలో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంపై భారతీయులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత భద్రత బలగాలు జమ్మూకశ్మీర్ లోని అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతుంటే మరోవైపు పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. దీంతో భారత్-పాక్ సరిహద్దులో వార్ టెన్షన్ నెలకొన్నది. భారత సరిహద్దుల వెంట పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. కరాచీలో ఉన్న యుద్ధ విమానాల్లో కొన్నింటిని లాహోర్, రావల్పిండికి, మరికొన్నింటిని కశ్మీర్ సరిహద్దుల వైపు తరలిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి.

ఒక్క మాట చాలు.. మనిషి మనసునే మార్చేస్తుంది కొన్నిసార్లు. ఆ ఒక్కమాటే చాలు.. ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది మరి కొన్నిసార్లు. ఇక మాటంటే.. ఇక్కడ పిలిచే విధానం.. పలికే తీరు కూడా అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తిని మీరు ఎలా పిలుస్తారన్నదీ ముఖ్యమే. అయితే మహిళలను వారికి ఇష్టమైన వ్యక్తులు బేబీ.. అని పిలిస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అది ఎలాగో ఈ పూర్తి కథనం చూస్తే మీకే అర్థం అవుతుంది. అందుకోసం ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

Next Story