- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది ముగిసిన అధ్యాయం: జనసేన వివాదంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ
జనసేనతో వివాదంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా తనకు, జనసేన పార్టీ (Janasena Party) శ్రేణులకూ మధ్య నడుస్తున్న వివాదానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎండ్ కార్డ్ వేశారు. అమిత్, పవన్ మీటింగ్ వివాదాస్పద అంశంపై స్వయంగా ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని, తన నిర్ణయాన్ని సదరు పార్టీ కూడా సానుకూలంగా ఆహ్వానించిందని తెలిపారు. కాబట్టి ఇక్కడితో ఆ వివాదం ఒక ముగిసిన అధ్యాయమని స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదాన్ని సాకుగా చూపి ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. తన ఇంటికి ఏపీ పోలీసులు రాలేదని.. కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గత 11 రోజులుగా తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని.. ఆ బెదిరింపులపై తగిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి విజ్ఞప్తి చేశానని అన్నారు. ఇక తాను ఉపసంహరించుకున్న వ్యాఖ్యలపై ఇప్పుడు మాట్లాడబోనని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.






