- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో ఆ ఐఏఎస్ దర్పం..! మంత్రికి ఘోర అవమానం
తెలంగాణ సచివాలయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కార్యాలయ ముఖ్య అధికారికి చేదు అనుభవం ఎదురైందని సెక్రటేరియట్‌లో గుసగుసలు వినపడుతున్నాయి. సదరు మంత్రి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం పూర్తి వివరాలతో ఒక శాఖ ముఖ్య అధికారికి లేఖ రాశారు. ఆ లేఖను మంత్రి పేషిలోని ఓ అధికారి.. ఆ సీనియర్ ఆఫీసర్ వద్దకు లేఖను ఇవ్వడానికి స్వయంగా వెళ్లారు. ఆ లేఖ చూసిన సీనియర్ అధికారి ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్చేశారట. ‘నిధులు ఎక్కడున్నాయి.. నిధులు లేవు.. ఏం లేవు... నిధులు లేవని మీ మంత్రికి తెలియదా? ఆయనకు ఆ మాత్రం ఫైనాన్స్గురించి తెలియదా? కేబినెట్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చకు వస్తనే ఉన్నది కదా?’ అంటూ ఆ లేఖ తీసుకెళ్లిన అధికారిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్లుగా సెక్రెటేరియట్వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ‘నిధులు తెచ్చుకోమని మీ మంత్రికి చెప్పండి.. అప్పుడు ఈ లెటర్ తీసుకుంటాను.. లేకపోతే లెటర్తీసుకునేది లేదు’ అంటూ ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. కనీసం లెటర్తీసుకోవాలని కోరినా తీసుకునే ప్రసక్తే లేదంటూ మంత్రి రాసిన లేఖను అధికారి వైపుగా విసిరేసినట్లగా తెలిసింది.
ఐఏఎస్‌లకు ఇది తగునా..?
అక్కడ జరిగిన పరిణామంతో ఒక్కసారిగా మంత్రి పేషీ అధికారి షాక్‌కు గురైనట్లుగా తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలియక వెనుతిరిగినట్లు సమాచారం. తన 30 ఏండ్ల సర్వీసులో ఒక మంత్రి రాసిన లేఖను సీనియర్ఐఏఎస్ అధికారి తీసుకోకపోవడమే కాకుండా కనీస మర్యాద లేకుండా మంత్రిని అవమానించేలా, అపహస్యం చేసేలా మాట్లాడటం ఎక్కడా చూడలేదని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. నిధులు ఉన్నా, లేకున్నా.. మంత్రి రాసిన లేఖను తీసుకుని.. నిధులు లేనందున ఈ పనులను మంజూరు చేయలేకపోతున్నామని సమాధానం ఇవ్వొచ్చని, కానీ ఈ విధంగా మాట్లాడాలని ఏ రకమైన సర్వీసులు చెబుతున్నాయి. ఏ రకంగా క్రమశిక్షణ, హోదాలో పెద్ద వారిని గౌరవించే పద్ధతి ఇదేనా? అంటూ సెక్రెటేరియట్ఉద్యోగుల్లో చర్చ జరిగినట్లుగా తెలిసింది. మంత్రులు నిధుల గురించి చూసుకుంటారని, కానీ ఇలా అవమానకరంగా మాట్లాడటం ఐఏఎస్‌లకు ఏ విధంగా కరెక్టు అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పేషీ అధికారి కొన్ని రోజుల వరకు కూడా ఆ షాక్ నుంచి కోలుకోలేదని, సచివాలయంలోని తన సహచరులతో చెప్పుకున్నట్లుగా సమాచారం. ఐఏఎస్ అధికారులు మరికొందరు ఇదే తరహాలో ఉన్నారని, మంత్రులంటే కనీసం గౌరవం, మర్యాద ఇవ్వడం లేదని, తామే గొప్ప, తామే పెద్దవారం, తమకే ఎక్కువ విషయాలు తెలుసుననే భావన వారిలో గూడుకట్టుకుపోయి మంత్రులను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.దీంతో మంత్రులు ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే మదనపడుతునట్లుగా తెలిసింది. మంత్రులను గౌరవించని, కలవని కొందరు ఐఏఎస్‌లపై సరియైన నియంత్రణ, క్రమశిక్షణా చర్యలు లేకపోవడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెద్దఎత్తున వ్యక్తం అవుతున్నాయని ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.






