డబుల్ మర్డర్ మిస్సింగ్.. క్షుద్రపూజలతో కూతురిని, అడవిలో వదిలేసి తల్లి హత్యకు ప్లాన్

by Bhoopathi Nagaiah |

తెలంగాణలో ఇవాళ రెండు దారుణ ఘటనలు జరిగాయి. బంగారం కోసం ఓ దగ్గర సొంత కూతురిని బలిచ్చేందుకు తండ్రి ప్రయత్నించగా.. మరో దగ్గర అదే బంగారం కోసం కన్నతల్లినే అడవిలో ఒంటరిగా వదిలేసి వచ్చింది ఓ కూతురు.

డబుల్ మర్డర్ మిస్సింగ్.. క్షుద్రపూజలతో కూతురిని, అడవిలో వదిలేసి తల్లి హత్యకు ప్లాన్
X

తెలంగాణలో ఇవాళ రెండు దారుణ ఘటనలు జరిగాయి. బంగారం కోసం ఓ దగ్గర సొంత కూతురిని బలిచ్చేందుకు తండ్రి ప్రయత్నించగా.. మరో దగ్గర అదే బంగారం కోసం కన్నతల్లినే అడవిలో ఒంటరిగా వదిలేసి వచ్చింది ఓ కూతురు. బంగారం కోసం రక్త సంబంధాలే తలదించుకునేలా వ్యవహరించిన ఈ దుశ్చర్యలు సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో వెలుగు చూశాయి. బీరువాల వ్యాపారి బంగారం నిధి కోసం అయోధ్య నుంచి స్వామిజీని రప్పించి క్షుద్రపూజలు నిర్వహించి, ఆరేళ్ల బాలికను బలిచ్చే ప్రయత్నం చేశాడు. స్థానికుల అప్రమత్తతో చిన్నారితో ప్రాణాలతో బయటపడింది. తల్లి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసిన కూతురు.. దట్టమైన అడవిలోకి తల్లిని తీసుకెళ్లి బంగారు ఆభరణాలను లాగేసుకుని వదిలేసి వెళ్లిపోయింది. తాను ఎక్కడ ఉన్నానో తెలియక తిండితిప్పలు లేక రెండు రోజులుగా వృద్ధురాలు ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అటుగా వెళ్తున్న యువకులు వృద్ధురాలిని గుర్తించడంతో సంఘటన వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.

కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ఉన్న కులగణన డిమాండ్‌పై రాహుల్ గాంధీ గొంతెత్తారని, తెలంగాణలో చేస్తామని మాటిచ్చి.. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి కూడా పంపామని గుర్తు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కులగణన బిల్లు ఆమోదం కోసం ఆందోళన చేశామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వం చేసిన కులగణనను ఆదర్శంగా తీసుకుని.. కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతోపాటుగా కులగణన‌ను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పలు కీలక డిమాండ్లు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో నిధులు ఉన్నా లేకపోయినా పనులు ఆగకుండా ఉండాలని, నీటి సంక్షోభం లేకుండా చూసేందుకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల కోసం వార్ రూమ్ పెడుతున్నప్పుడు, పనులు చేసేందుకు వార్ రూమ్ పెట్టడంలో తప్పు లేదు కదా..?’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​అన్నారు. ఏపీలోని ఉపాధి శ్రామికులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​చెప్పింది. వారికి రూ.30 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది. ఇందుకు సంబంధించి పవన్​కల్యాణ్ సమక్షంలో ఎస్‌బీఐ, పంచాయతీరాజ్​శాఖ ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా డీసీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల రాప్తాడులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర చోటుచేసుకున్న పరిణామాలపై తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు తోపుదుర్తి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఈ సంఘటనపై పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.

Next Story