థాంక్యూ ఖర్గే జీ.. మీరైనా గుర్తించారు!.. బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2024-06-03 09:54:00  IST  )

తెలంగాణ గౌరవాన్ని మీరైనా గుర్తించినందుకు ధన్యావాదాలు ఖర్గే గారు, ఇది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలా ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

థాంక్యూ ఖర్గే జీ.. మీరైనా గుర్తించారు!.. బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గౌరవాన్ని మీరైనా గుర్తించినందుకు ధన్యావాదాలు ఖర్గే గారు, ఇది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలా ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే చేసిన ట్వీట్ కు బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. దీనిపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలలో కాకతీయ కళా తోరణం, చార్మినార్ ను చేర్చినందుకు ఖర్గేకి ధన్యవాదాలు తెలిపారు.

అంతేగాక తెలంగాణ గర్వాన్ని మరిచిపోయిన యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డిలా కాకుండా కాంగ్రెస్ లో ఎవరో ఒకరు వారసత్వాన్ని గర్తించడం పునరుత్సాహాన్ని ఇస్తుందని, మీ ధ్రువీకరణ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టు అవుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ట్వీట్ లో తెలంగాణ ఫార్మేషన్ డే అని తెలంగాణ మ్యాప్ లో కాకతీయ కళాతోరణం, చార్మినార్, అమరవీరుల స్థూపం ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ పై విధంగా స్పందించింది.

Next Story