- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ వల్లే సాధ్యమైంది.. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతం.. ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్
నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన వెల్లడించారు. నూతన సంవత్సర సందర్భంగా నగర వ్యాప్తంగా చేపట్టిన కఠినమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న అంశంపై నిర్వహించిన విస్తృత అవగాహన కార్యక్రమాలు, అలాగే ప్రజల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ నియంత్రణ చర్యల ఫలితంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోలేదని తెలిపారు.
‘ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. అవగాహన పనిచేసింది, బాధ్యత గెలిచింది, మీ సహకారమే తేడాను చూపించింది. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, నిజమైన గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దేందుకు మనమందరం కలిసి పని చేయాలి’ అని సజ్జనార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే, ‘హైదరాబాద్ మరోసారి నిరూపించింది.. ప్రమాదం లేకుండా కూడా సంబరాలు జరుపుకోవచ్చు అని.. ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోండి.. మద్యం, స్టీరింగ్ ఎప్పటికీ కలవకూడదు’ అని ప్రజలకు సూచించారు. ట్వీట్ ఇదే..






