- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు కృతజ్ఞతలు: Upasana Kamineni Konidela
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ లీడర్‌గా స్థాపించడానికి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 ను రూపొందించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ లీడర్‌గా స్థాపించడానికి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 (Telangana Sports Policy 2025) ను రూపొందించింది. ఛాంపియన్‌లకు కేంద్రంగా మారాలనే రాష్ట్ర దార్శనికతను సాకారం చేసుకోవడానికి, స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ (Sports Hub of Telangana)ను క్రీడా పర్యావరణ వ్యవస్థ యొక్క అన్ని కోణాల్లో స్థిరమైన, సమగ్ర అభివృద్ధి ద్వారా నడిచే ఒక పునాదిరాయి చొరవగా ఊహించారు. ఇందుకు స్పోర్ట్స్ హబ్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తోంది. ఈ సంస్థకు చైర్మన్ గా సంజీవ్ గోయెంకా, కో చైర్మన్ గా కామినేని ఉపాసన (Kamineni Upasana)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)కి, రాష్ట్ర ప్రభుత్వానికి కామినేని ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తనత ట్వీట్‌లో "తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దనున్న సంజీవ్ గోయంకతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ఈ ధైర్యమైన దార్శనికతకు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను (PPP) నిర్మించడానికి, రాష్ట్రంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న క్రీడా పర్యావరణ వ్యవస్థ ను సృష్టించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు. ధన్యవాదాలు జయేష్ రంజన్ అని ఉపాసన తన ట్వీట్ లో రాసుకొచ్చారు.






