- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సమస్యలకు పరిష్కారం చూపాలి.. లేదంటే నిరాహార దీక్ష చేస్తాం : SWU INTUC హెచ్చరిక
జనవరి 18న మేడారంలో సమ్మక్క-సారక్క సన్నిధిలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని TGSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (SWU INTUC) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జనవరి 18న మేడారంలో సమ్మక్క-సారక్క సన్నిధిలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని TGSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (SWU INTUC) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని యూనియన్ హెచ్చరించింది. గత ఆరు ఏళ్లుగా ఆర్టీసీలో కార్మిక సంఘాలకు అనుమతి లేకపోవడంతో పనిభారం, వేధింపులు పెరిగాయని యూనియన్ తెలిపింది. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న పే స్కేల్, 2025లో రావాల్సిన రెండో పే స్కేల్, ఆర్టీసీ కార్మికుల విలీనం ప్రక్రియ పూర్తి చేయడం, అపాయింటెడ్ డే ప్రకటించడం వంటి అంశాలను క్యాబినెట్‌లో నిర్ణయించాలని డిమాండ్ చేసింది.
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ..
అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అరియర్స్, టెర్మినల్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కోరింది. సిబ్బంది సంఖ్య తగ్గినా మేడారం జాతర, దసరా, సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు విజయవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతున్న ఆర్టీసీ కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేసి కార్మికుల్లో ఉన్న అసంతృప్తి, అభద్రతా భావాన్ని తొలగించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






