భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ బస్సులు.. TGSRTC వెల్లడి

by Ramesh Naini |   (  Updated:2025-10-23 13:22:18  IST  )

భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించింది.

భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ బస్సులు.. TGSRTC వెల్లడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పవిత్ర కార్తీక మాసం (Karthika masam) సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సు (special buses) సేవలను ప్రారంభించింది. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా చేరుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులు నడపబడనున్నాయి. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ సంస్థ గురువారం “ఎక్స్” వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్తీకమాసంలో శైవ క్షేత్రాల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు టీజీఎస్ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 040-2345 0033, 040-6944 0000, ఆన్‌లైన్ tsrtcbus.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.

Next Story