- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగకు సొంతూరికి వెళ్లేవారి కోసం స్పెషల్ బస్సులు.. కానీ చిన్న ట్విస్ట్
బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నది. 7,754 స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయనుంది.
ఎక్కడి నుంచి అంటే..
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్ర నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర స్టేట్స్‌కు సైతం ప్రత్యేక సర్వీసులు వెళ్లనున్నాయి.
తప్పని చార్జీల వడ్డన
జీవో 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే స్పెషల్ బస్సులకయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు ఆర్టీసీ టికెట్ ధరలు పెంచనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల పెంపు ఉండనుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.
గతేడాది కంటే 617 బస్సులు ఎక్కువ
గతేడాది కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సైతం ఏర్పాటు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. స్పెషల్ సర్వీసుల సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.






