- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన
ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉద్యోగార్థులకు కీలక విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని నమ్మొద్దని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (MD VC Sajjanar) ఎక్స్ వేదికగా ఉద్యోగార్థులను అలర్ట్ చేస్తూ ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులోనే ఆయన.. సంస్థలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలైందని, ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని తెలిపారు. అయితే.. ఈ నియామకాల ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందాలని ట్రై చేసేవారెవరికీ ఉద్యోగాలు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు అడిగేవారి మాటల్ని నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు సూచించారు. ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావడం లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తోంది.






