- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. స్పెషల్ డిస్కౌంట్!
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లే ప్రయాణికులకు (TGSRTC) టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. (Hyderabad to Tirupati) హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే లహరి ఏసీ బస్సుల్లో ఆర్టీసీ స్పెషల్ డిస్కౌట్ కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఈ లహరి ఏసీ బస్సుల్లో 10 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. టికెట్ రిజర్వేషన్ కోసం ఆన్‌లైన్ www.tgsrtcbus.in ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది.
Divine comfort. Divine savings. ✨Travel Hyderabad ↔ Tirupati with Flat 10% OFF on #TGSRTC Lahari A/C buses.@revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC#Telangana #Hyderabad #Tirupathi #TakingTelanganaForward pic.twitter.com/m2U5CLOV6K
— TGSRTC (@TGSRTCHQ) September 4, 2025






