- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC: జనరల్ బస్‌పాస్ దారులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్‌లో తిరగొచ్చు!
హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. రూ.20 ధరకే ‘మెట్రో కాంబి టికెట్’ కాంబినేషన్ టికెట్‌తో (Metro Deluxe) మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. దీంతో మెట్రో బస్‌పాస్, సాధారణ (జనరల్ బస్‌పాస్) (general bus pass) నెలవారీ బస్ పాస్ ఉన్నవారు హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించొచ్చు. నగర ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) ఎక్స్ వేదికగా ఈ వివరాలను ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా, స్టూడెంట్ బస్ పాస్ కలిగిన వారు మెట్రో బస్సులో ప్రయాణించాలంటే ఇదివరకు రూ.10 కాంబినేషన్ ఉన్న విషయం తెలిసిందే.






