- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TGSRTC: ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి పుష్పక్ బస్సులు

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad International Airport) వెళ్లాలంటే నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు తమ సొంత వాహనాల్లో అక్కడి వెళ్తుండగా.. పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో ప్రయాణ ఛార్జీలు చెల్లించలేక సామన్య జనంపై ఆర్ధికంగా భారం పడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) వాసులకు టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జేబీఎస్ (JBS), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Rajiv Gandhi International Airport)కు మొదటిసారిగా బస్సు సర్వీసులను ప్రారంభించింది. మొత్తం ఎయిర్‌పోర్టుకు 6 పుష్పక్ బస్సుల (Pushpak Buses)ను బుధవారం ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్ (Greater RTC In-charge ED Rajasekhar) పేర్కొన్నారు.
శంషాబాద్‌లోని విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో పుష్పక్ ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జేబీఎస్ (JBS) నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ Secunderabad Railway Station), రాణిగంజ్ (Ranigunj), సచివాలయం(Secretariat), రవీంద్ర భారతి (Ravindra Bharati), హజ్ హౌస్, నాంపల్లి (Nampally), గాంధీభవన్, ఎంజే మార్కెట్ (MJ Market), అఫ్జల్‌గంజ్, బహుదూర్‌పురా, ఆరంఘర్, శంషాబాద్‌కు మొదటి బస్సు అర్థరాత్రి 12.55 నుంచి చివరి బస్సు రాత్రి 11.55 వరకు నడుపుతున్నట్లు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అర్థరాత్రి 12.50 నుంచి రాత్రి 11.50 వరకు బస్సు సర్వీసులను నడుపనున్నారు.