- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీఎస్‌ఆర్టీసీకి భారీ ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్.. ఒలెక్ట్రా నుంచి 1,085 ఈ-బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ)కు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) 1085 బస్సులను సరఫరా చేయనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) 1085 బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పీఎంఈ డ్రైవ్ పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుంది. టీజీఎస్ ఆర్టీసీకి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులున్నాయి.
రోడ్లకు అనుగుణంగా బస్సులు
స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా బస్సులను రూపొందించారు. బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్‌చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాల ఆర్డర్ ఉంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ ‘మేక్ ఇన్ ఇండియా’ దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే మా కట్టుబాటుకు పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ఆర్డర్ మరింత బలం చేకూర్చిందన్నారు.






