- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీని త్వరగా ప్రభుత్వంలో విలీనం చేయాలి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది.

- టీజీఎస్ఆర్టీసీ ఎండీకి ఎంప్లాయీస్ యూనియన్ వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ఒక వినతిపత్రం అందజేశారు. గత నెల ఏప్రిల్ 22 నుండి 24 వరకు జరిగిన సమ్మె డిమాండ్లపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో విలీన ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి జీవో నెం. 961 విడుదల చేశారని, అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులుగా ఉన్న కమిటీ ఉత్తర భారతదేశంలో పర్యటించి నివేదికను కూడా సమర్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు విలీనానికి అంగీకరిస్తూ కమిటీని వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ కమిటీలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులకు తప్పనిసరిగా చోటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. వచ్చే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ను ప్రకటించేలా యాజమాన్యం చొరవ చూపాలని వారు కోరారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విలీనంపై తాము చేసిన అధ్యయన నివేదికను, ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులపై సేకరించిన సమాచారాన్ని కూడా పరిశీలించాలని యూనియన్ నేతలు ఎండీని కోరారు. కాగా... యూనియన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపించి విలీన ప్రక్రియకు కృషి చేయనున్నట్లు ఎండీ హామీ ఇచ్చారని ఈదురు వెంకన్న తెలిపారు.






