- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC : డిపోల ప్రైవేటీకరణపై ఆర్టీసీ క్లారిటీ
by Muthe.Rajitha |
తెలంగాణలో ఆర్టీసీ(TGSRTC) బస్సు డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఖండించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ(TGSRTC) బస్సు డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల(Electrical Buses) పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారం అని వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనన్స్, ఛార్జింగ్ మాత్రమే ఆయా బస్సుల కంపెనీలు నిర్వహిస్తాయని, మిగతా అన్ని ఆపరేషన్స్ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారమే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీ(EV Policy)ని అనుసరించి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని తెలిపింది. ఈ ఏడాదిలో మేలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
Next Story






