- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGSRTC: ప్రమాదాలపై టీజీఎస్ఆర్టీసీ అలర్ట్.. బస్సుల్లో సైరన్, సేఫ్టీ ప్రికాషన్స్..
కర్నూలులో ఇటీవల జరిగిన కావేరి బస్సు ప్రమాద ఘటనతో టీజీఎస్ఆర్టీసీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలులో ఇటీవల జరిగిన కావేరి (Bus accident) బస్సు ప్రమాద ఘటనతో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వారి ముఖ్య గమనిక అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు ప్రకటించింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ రకాల బస్సుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోందని, ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సులలో సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది. లహరి ఏసీ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కం సీటర్, రాజధాని ఏసీ బస్సులలో వెనుక భాగంలో అత్యవసర ద్వారంను ఏదైనా కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పులకు ఫైర్ ఎక్స్టింగిషెర్, ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్ నందు మంటలను ఆర్పుటకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, మంటలను ఆర్పే పరికరాలు అమర్చబడ్డాయని పేర్కొంది.
అలాగే ఆ బస్సుల్లో ప్రయాణికులను అప్రమత్తం చేయుటకు సైరన్ పొందుపరిచినట్లు వెల్లడించింది. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగిషర్, బస్సు వెనుక భాగంలో కుడి వైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది. డీలక్స్ ఎక్స్ ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో కుడివైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం, ఫైర్ ఎక్స్టింగిషెర్ లు ఏర్పాటు చేసినట్లు వివరించింది. ‘మీ ఆదరణ మాకు కొండంత అండ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అంటూ శుభాకాంక్షలతో మీ టీజీఎస్ఆర్టీసీ అని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఇటీవల కర్నూలులో కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరగడంతో అందులో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ సేఫ్టీ ప్రికాషన్స్ వివరించినట్లు తెలుస్తోంది. ట్వీట్ ఇదే..






