- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ కథనానికి స్పందన.. 20 వేల విద్యుత్ మీటర్ల తక్షణ విడుదల
‘దిశ’లో ప్రచురితమైన “యావరేజ్ బిల్లింగ్ దోపిడీ” కథనానికి టీజీఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం స్పందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ’లో ప్రచురితమైన “యావరేజ్ బిల్లింగ్ దోపిడీ” కథనానికి టీజీఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం స్పందించింది. కాలిపోయిన, స్ట్రక్ అయిన విద్యుత్ మీటర్లను తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేస్తూ 20 వేల కొత్త మీటర్లను విడుదల చేసింది. వీటితో పాటు మరో 20 వేల మీటర్లు కూడా అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. విడుదల చేసిన మీటర్లను మూడు రోజుల్లో బిగించాలని అధికారులను ఆదేశించింది. గత ఆరేడు నెలలుగా కాలిపోయిన మీటర్లు మార్చకపోవడంతో యావరేజ్ బిల్లింగ్ పేరుతో వినియోగదారులపై సుమారు రూ.15 కోట్లకు పైగా భారం పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి యావరేజ్ బిల్లింగ్ ఉండదని, ఎంత వినియోగిస్తే అంతే బిల్లు విధిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం లభించింది. అయితే గత ఆరేడు నెలలుగా స్టాక్ లేదనే సాకుతో పాత మీటర్లను మార్చకపోవడంతో పాటు యావరేజీ బిల్లింగ్ మాయాజాలం వల్ల శీతాకాలంలో కూడా వినియోగదారులు వేసవి స్థాయిలో బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. దీనివల్ల ప్రజలపై సుమారు రూ. 15 కోట్ల అదనపు భారం పడిందని అంచనా. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇప్పటికే నష్టపోయారని, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని వినియోగదారులు, విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సంస్థ తప్పిదం వల్ల నష్టం జరిగిన నేపథ్యంలో ఈఆర్‌సీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల మెటిరీయల్ కొనుగోళ్లు జరిగినా కీలకమైన మీటర్ల కొరత ఎందుకు ఏర్పడిందన్న అంశంపై సమగ్ర విచారణ అవసరమని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






