- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGSPDCLలో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై కమిటీ
తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్) పరిధిలోకి ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల నేపథ్యంలో.. టీజీఎస్పీడీసీఎల్ లోని సిబ్బంది నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

- రైతు డిస్కం ఏర్పాటు నేపథ్యంలో సీఎండీ జితేష్ వి.పాటిల్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్) పరిధిలోకి ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల నేపథ్యంలో.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) లోని సిబ్బంది నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్‌లతో పాటు మూడో డిస్కంగా టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. ఈ కొత్త డిస్కంకు ఆస్తులు, అప్పులు, వినియోగదారుల కేటగిరీలు, మానవ వనరుల (సిబ్బంది) బదిలీకి సంబంధించిన విధివిధానాలను సైతం ఖరారు చేసింది. దీని ప్రకారం టీజీఎస్పీడీసీఎల్‌కు చెందిన వివిధ కేడర్ల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కొత్త డిస్కంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ విధులను నిర్వహించేందుకు బదిలీ/కేటాయింపు చేస్తున్నారు.
సిబ్బంది పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం
భారీ సంఖ్యలో సిబ్బంది కొత్త డిస్కాంకు వెళ్తుండటంతో, ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్‌లో ఉన్న మానవ వనరుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ సంస్థలోని ప్రస్తుత సిబ్బంది స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టీజీఎస్పీడీసీఎల్‌లో సిబ్బంది పునర్వ్యవస్థీకరణపై సమగ్ర నివేదికను సమర్పించనుంది. మొత్తం 11 మంది అధికారులతో కూడిన ఈ ఉన్నత స్థాయి కమిటీకి డైరెక్టర్ (కమర్షియల్ అండ్ హెచ్ఆర్‌డీ) చైర్మన్ గా డైరెక్టర్ (ఆపరేషన్), డైరెక్టర్ (ఫైనాన్స్)తో పాటు, ఐదుగురు సీఈలు, జీఎం (అడ్మిన్), డీఈ (ఎంపీపీ), ఈఈ (క్వాలిటీ) సభ్యులుగా ఉంటారు.






