TGSPDCL: ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయాలు ఉండొద్దు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.

TGSPDCL: ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయాలు ఉండొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్‌ఈలు, డీఈలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె ప్రభావం విద్యుత్ సరఫరాపై పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా సబ్‌స్టేషన్ల నిర్వహణ కోసం ఓఅండ్ఎం స్టాఫ్, సబ్ ఇంజినీర్లు, ఎంఆర్‌టీ, డీపీఈ, కన్స్ట్రక్షన్ విభాగాల ఇంజనీర్లను షిఫ్టుల వారీగా విధుల్లో నియమించాలని ఆదేశించారు.

వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. ఫీల్డ్ లెవెల్‌లో అవసరమైన అన్ని రకాల ఓఅండ్ఎం మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే ఎస్‌ఈలు తక్షణమే స్పందించి, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. సమ్మె ప్రభావం దృష్ట్యా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బందితో పనులను సమన్వయం చేసుకోవాలని.. ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, విద్యుత్ వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Next Story