ఆర్టీసీలో ఇంకా 2013 పీఆర్సీనే అమలవుతోంది: టీజీఎస్ ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్

by Ajay Maddhiboyina |

2013 వేతన సవరణలో పెంచబడిన అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ నే నేటికీ ఆర్టీసి కార్మికులు పొందుతున్నారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) వాపోయింది. 2017 వేతన సవరణ జరిగినప్పటికీ అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్టీసి కార్మికులకు కొత్తవి ఇవ్వకుండా యాజమాన్యం విస్మరించడం పట్ల కార్మిక వర్గమంతా అసంతృప్తితో ఉన్నారని ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీలో ఇంకా 2013 పీఆర్సీనే అమలవుతోంది: టీజీఎస్ ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2013 వేతన సవరణలో పెంచబడిన అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ నే నేటికీ ఆర్టీసి కార్మికులు పొందుతున్నారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) వాపోయింది. 2017 వేతన సవరణ జరిగినప్పటికీ అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్టీసి కార్మికులకు కొత్తవి ఇవ్వకుండా యాజమాన్యం విస్మరించడం పట్ల కార్మిక వర్గమంతా అసంతృప్తితో ఉన్నారని ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల మాత్రం ఇష్టానుసారంగా అలవెన్సులను భారీగా పెంచేసుకుని... కష్టపడి పని చేసే క్రిందిస్థాయి ఉద్యోగులకు అలవెన్సులు అమలు చేయకపోవడం యాజమాన్యం చూపుతున్న వివక్షతకు నిదర్శనమని వారు విమర్శించారు.

గతంలో ఆర్టీసిలో వేతన సవరణతో పాటు అలవెన్సులు కూడా పెంచేవారని.... ఆ విధానాన్ని తుంగలో తొక్కిన యాజమాన్యం 2024 లో 2017 వేతన సవరణ చేసినప్పటికీ దీనితోపాటే అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగా ఆ అలవెన్సులను ఇవ్వడం లేదని తెలిపారు. ఆర్టీసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ నిత్యం కష్టపడుతున్న కార్మికవర్గాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి వారికి రావలసిన ఆర్థిక సదుపాయాలన్నింటిని సమకూర్చి, 2017 అలవెన్సులను, ఫ్రింజ్ బెనిఫిట్స్ ను 100 నుండి 200 శాతానికి పెంచి కార్మికులలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపైఆర్టీసీ ఎండీకి వినతిప్రతాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్మికుల కడుపులు కొట్టడం మానుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story