టికెట్ల ధరల పెంపు వార్తలపై టీజీఆర్టీసీ వివరణ

by Gantepaka Srikanth |

టికెట్ల ధరల పెంపు వార్తలపై టీజీఆర్టీసీ వివరణ

టికెట్ల ధరల పెంపు వార్తలపై టీజీఆర్టీసీ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కొందరు తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ (TGSRTC) మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు టికెట్ ధరలను పెంచింది అని ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత అవసరానికి అనుగుణంగా అక్టోబర్ 6, 2025న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధించాం. కానీ ఆ తరవాత, తెలంగాణలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఎలాంటి టికెట్ ధరలను పెంచలేదు అని ఆయన తెలిపారు.

సాధారణంగా, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరల పెరుగుదల డీజిల్ ధరకు నేరుగా అనుసంధానంగా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా, టీజీఎస్‌ఆర్టీసీ ధరల పెరుగుదలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తాం. కానీ చాలా సందర్భాల్లో, టికెట్ ధరల పెంచడం వల్ల ప్రయాణికులకు కలిగే ఆసౌకర్యాని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాం. కాకపోతే, టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ వసూలు చేస్తున్నా విషయం చాల కాలం తరవాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి తెలియకపోవచ్చు అని నాగిరెడ్డి తెలిపారు.

Next Story