సొంతూళ్ల నుంచి HYD బాటపట్టిన నగరవాసులు.. TGRTC కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

దసరా పండుగ తిరుగు ప్రయాణం నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

సొంతూళ్ల నుంచి HYD బాటపట్టిన నగరవాసులు.. TGRTC కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ తిరుగు ప్రయాణం నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 1050 స్పెషల్ బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. అందులో అత్యధికంగా వరంగల్ రీజియన్ నుంచి 229, కరీంనగర్ నుంచి 211, నల్గొండ నుంచి 137 ప్రత్యేక సర్వీసులని నడిపింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు రద్దీ కొనసాగనుందని భావిస్తున్నారు. అలాగే, సోమవారం కూడా హైదరాబాద్‌కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. అందుకే రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Next Story