- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఆర్జేసీ సెట్ 2026 పరీక్షకు 77.77 శాతం హాజరు
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్స్ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ పరిక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

- పరీక్షకు ధరఖాస్తు చేసుకున్న 76,174 మంది అభ్యర్థులు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్స్ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ పరిక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 77.77 శాతం మంది హాజరయ్యారు. ఈ ఏడాది 35 గురుకులాలలు, 93 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం మొత్తం 76,174 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా 59,244 (77.77 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో వచ్చే మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు. టీజీఆర్జేసీ పరిక్ష రాసిన విద్యార్థినులకు ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మెరిట్ ఆధారంగా అటు గురుకులాల్లో, ఇటు కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేజీబీవీల్లో సీటు పొందే అవకాశం దక్కింది. దినిపై తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారులతో చర్చించి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 93 కేజీబీవీలను ప్రభుత్వం యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చింది. ఈ సంస్థల్లో అడ్మిషన్ పొందిన వారికి రెగ్యులర్ ఇంటర్ తో పాటు, ఐఐటీ, జేఈఈ, నీట్, ఈఏపీసెట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు.






