- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGRJC CET 2026: గురుకుల ఇంటర్ ప్రవేశాలకు చివరి రోజు.. మే 3న ఎంట్రన్స్ టెస్ట్
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఆర్‌జేసీ) ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఆర్‌జేసీ) ఆధ్వర్యంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. టీజీఆర్జేసీ సెట్ -2026 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు గడువు (ఏప్రిల్ 15) రేపటితో పూర్తి కానున్నట్లు సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అందుబాటులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.
ఇప్పటివరకు సుమారు 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 3 న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in/ ను సంప్రదించాలని సూచించారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో 3 వేల సీట్లు, కేజీబీవీల్లో 3700 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. టీజీ ఆర్ జేసీసెట్ 2026 పరీక్షకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం విశేషం.






