TGPSC : గ్రూప్ 3 అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్

by Muthe.Rajitha |

తెలంగాణ గ్రూప్ 3(Group 3) అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ప్రకటించింది.

TGPSC : గ్రూప్ 3 అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రూప్ 3(Group 3) అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ప్రకటించింది. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన(Certificates Verification) జరపనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో 1,388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీలో భాగంగా నవంబర్ 17, 18న పరీక్ష జరిగింది. వీటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఇటీవలే కమిషన్ విడుదల చేసింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూన్ 18 నుంచి జూలై 8 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపనుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆయా తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం జూలై 9 రిజర్వ్ డేగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్‌లో జరగనుంది.

ఈ పరిశీలన రెండు సెషన్లలో.. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుంచి 5:30 వరకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీలు, రెండు సెట్ల అటెస్టేషన్ ఫారమ్‌లు, చెక్‌లిస్ట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలి. జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వివరాల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను సందర్శించాలని కోరింది.

Next Story