తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-28 10:39:13  IST  )

అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 ఫలితాలు(Group-2 Results) విడుదల అయ్యాయి.

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 ఫలితాలు(Group-2 Results) విడుదల అయ్యాయి. ఆదివారం టీజీపీఎస్సీ(TGPSC) చైర్మన్ బుర్రా వెంక‌టేశం(Burra Venkatesham) ఫలితాలను విడుద‌ల చేశారు. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. ఒక్క పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో పెట్టింది. మొత్తం 18 కేట‌గిరిల‌కు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://www.tspsc.gov.in/

కాగా, 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దశల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో.. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేశారు. తర్వాత వెను వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story