- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1: మా నోటికాడి కూడు లాక్కోకండి.. గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిందండ్రులు కంటతడి
మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని దయచేసి మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్-1 ర్యాంకర్ల (Group-1 Rankers) తల్లిదండ్రులు కోరారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు, రాజకీయ వివాదం నేపథ్యంలో ర్యాంకులు సాధించిన 200 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు (Parents) ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో (Somajiguda Press Club) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పేరెంట్స్.. ఒక్కొ పోస్టును రూ.3 కోట్లు వెచ్చించి పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాలో చాలా మంది కూటికి లేని వాళ్లం ఉన్నాం. రూ. 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. పస్తులుండి మా పిల్లలను చదివించాం. తప్పుడు ఆరోపణల వల్ల మా పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ మీడియా సమావేశంలోనే ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఎన్నికలు పెట్టమని కోర్టుకు వెళ్తారా?:
గ్రూప్-1 ర్యాంకర్లపై ఆరోపణలు చేసే వారు వాటిని నిరూపించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వచ్చాకే పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని ఇప్పుడు మీ రాజకీయల కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మా పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని చెప్పారు. పోస్టులు కొన్నామన్న ప్రచారంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పోస్టులు కొన్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని కానీ పిల్లల భవిష్యత్తుపై రాజకీయాలు వద్దని కోరారు. రాజకీయ నాయుకులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరే గెలుస్తారు. అలా అని ఓడిపోయిన నేతలంతా మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా అని ప్రశ్నించారు.
న్యాయవ్యవస్థపై నమ్మకముంది:
పరీక్షలు మళ్లీ రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారెంటీ ఏంటి? ర్యాంకులు తెచ్చుకుని కూడా మా పిల్లలు రోడ్డు పడనట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు విజేతలుగా ఉన్న మా పిల్లలు ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తోందని గ్రూప్-1 ర్యాంకర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మీ రాజకీయల కోసం మా పిల్లల భవిష్యత్ నాశం చేసి నోటికాడి కూడు లాక్కోవద్దని అన్నారు.






