- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC: పండుగపూట గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్
గ్రూపు-1(Group-1) అభ్యర్థులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అలర్ట్ చేసింది. ఉగాది పండుగపూట కీలక అప్డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1(Group-1) అభ్యర్థులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అలర్ట్ చేసింది. ఉగాది పండుగపూట కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూపు - 1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల(Group-1 General Rankings Released) చేసింది. టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకింగ్ లిస్ట్ పొందుపరిచినట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం(Chairman Burra Venkatesham) పేర్కొన్నారు. ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు 563 పోస్టుల భర్తీకి 2024 ఫిబ్రవరి 19వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం సుమారు 4 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 21,093 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసి.. ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేయగా, తాజాగా జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మార్చి 31వ తేదీలోపు గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (TG CM Revanth Reddy) చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఫలితాల విడుదల చేశారు.






