- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC: జూన్ 7న కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్ష..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్ష తేదీని ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మే-2026 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ‘ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్’ పరీక్షను జూన్ 7న నిర్వహించనున్నట్లు కమిషన్ అడిషనల్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో కూడిన హెచ్ఎండీఏ (HMDA) పరిధితో పాటు రాష్ట్రంలోని ఇతర ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ [https://www.tgpsc.gov.in](https://www.tgpsc.gov.in) ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అభ్యర్థులు సహాయం కోసం 040-22445566 ల్యాండ్‌లైన్ నంబర్ ద్వారా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చని కమిషన్ పేర్కొంది. ఇతర పూర్తి వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.






