గ్రూప్-2 అభ్యర్థులకు TGPSC అలర్ట్

by Muthe.Rajitha |

గ్రూప్ 2(Group-2) అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అలర్ట్స్ జారీ చేసింది.

గ్రూప్-2 అభ్యర్థులకు TGPSC అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 2(Group-2) అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అలర్ట్స్ జారీ చేసింది. తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థుల సెకండ్ స్పెల్ సర్టిఫికేషన్ తేదీలను కమిషన్ విడుదల చేసింది. ఆగస్టు 20 నుంచి 23 వరకు ఆయా అభ్యర్థులు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని సూచించింది. అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అప్షన్లు ఎంచుకోవాలని తెలిపింది. వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాలని కోరింది.

ఒకవేళ ఎవరైనా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపిక కాలేరని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు https://www.tgpsc.gov.in/ కమిషన్ అధికారిక వెబ్సైటులో చెక్ చేయాలని తెలియజేసింది.


Next Story