కర్ల రాజేశ్ లాకప్ డెత్.. విచారణకు ఆదేశించిన టీజీహెచ్‌ఆర్‌సీ

by Ramesh Naini |

కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ కేసులో వచ్చిన ఆరోపణలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (TGHRC) విచారణకు ఆదేశించింది.

కర్ల రాజేశ్ లాకప్ డెత్.. విచారణకు ఆదేశించిన టీజీహెచ్‌ఆర్‌సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ కేసులో వచ్చిన ఆరోపణలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (TGHRC) విచారణకు ఆదేశించింది. SR నెం.4129, 4130 ఆఫ్‌ 2025 కింద నమోదైన ఫిర్యాదులను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. మృతుడి తల్లి కర్ల లలితతో పాటు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఫార్మర్‌ ఎంపీ వెంకటేష్‌ నేత, ఇతర సామాజిక కార్యకర్తలు కమిషన్‌ ముందు ఫిర్యాదులు సమర్పించారు. చిల్కూర్‌, కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ల రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, థర్డ్‌ డిగ్రీ పద్ధతులతో హింసించారని, తప్పుడు క్రిమినల్‌ కేసులో ఇరికించి కుటుంబ సభ్యులను కలవనీయలేదని వారు ఆరోపించారు.

అలాగే, సబ్‌జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినప్పటికీ, కస్టడీలో జరిగిన తీవ్ర గాయాల కారణంగానే రాజేశ్ మృతి చెందాడని కమిషన్‌ గమనించింది. ఈ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్న కమిషన్‌, ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే నమోదైన SR నెం.3693/2025 ఫిర్యాదుతో ప్రస్తుత కేసులను కలిపి సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించిన కమిషన్‌, తదుపరి విచారణను 12 జనవరి 2026కు వాయిదా వేసింది.

Next Story