- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 17న కౌన్సెలింగ్
రాష్ట్రంలో టీజీఈసెట్ (TG ECET) 2026 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఖాళీగా ఉన్న లేటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీజీఈసెట్ (TG ECET) 2026 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఖాళీగా ఉన్న లేటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీఈసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఎ. దేవసేన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ఈ ప్రకటన ప్రకారం.. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి రెండు రోజుల పాటు(రేపు, ఎల్లుండి) దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 17వ తేదీన ఆయా కాలేజీల్లో నేరుగా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు.
ముఖ్యమైన సూచనలు..
స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు నిర్ణీత తేదీన సంబంధిత కాలేజీల్లో వ్యక్తిగతంగా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిషన్లకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు..
స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం వర్తించదని, అభ్యర్థులు పూర్తి ఫీజును స్వయంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgecet.nic.in ను సందర్శించవచ్చు.






