- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతమే లక్ష్యం: టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) అడుగులు వేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) అడుగులు వేస్తోంది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)పై ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రతినిధులకు ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లు, అక్రిడిటేషన్లను మెరుగుపరిచేందుకు మండలి ప్రత్యేక మెంటరింగ్‌ను ప్రారంభించిందని తెలిపారు.
ర్యాంకింగ్‌లు పెరగడం వల్ల కళాశాలలకు నిధుల లభ్యత పెరగడమే కాకుండా, విద్యా నాణ్యత కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. పరిశోధనలు, సైటేషన్లు, పేటెంట్లు, నిధులు పొందే ప్రాజెక్టులపై అధ్యాపకులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ను కేవలం ఒక మూల్యాంకన సాధనంగా కాకుండా, విద్యా సంస్థల వృద్ధికి ఒక రోడ్‌మ్యాప్‌గా చూడాలని కోరారు. వర్క్‌షాప్‌లో భాగంగా పలువురు నిపుణులు విలువైన సూచనలు చేశారు. డా. కె. వీరాంజనేయులు (ఎస్ కేఎల్ టీహెచ్యూ) అడ్వైజర్ ఎన్‌ఐఆర్‌ఎఫ్ మెథడాలజీ, స్కోర్ వెయిటేజీపై అవగాహన కల్పించారు.
డా. జె. ఉపేందర్ (ఓయూ నోడల్ ఆఫీసర్) టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలో వివరించారు. కె. వెంకటేష్ (డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అకాడెమిక్ ఎక్సలెన్స్) డేటా మేనేజ్‌మెంట్, డేటా అప్‌లోడ్ చేసే సరైన విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీసీహెచ్‌ఈ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్. కె. మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, సిసిఈ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డిఎస్ఆర్. రాజేందర్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి సుమారు 100 మంది ఐక్యూఏసీ కోఆర్డినేటర్లు, నోడల్ ఆఫీసర్లు, సీనియర్ ఫ్యాకల్టీ ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.





