- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్నత విద్యా మండలి ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ సంయుక్త ముందడుగు
రాష్ట్రంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ), కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ) చేతులు కలిపాయి.

- ఆవిష్కరణలు, పారిశ్రామికతకు పెద్దపీట
- కళాశాలల్లో సరికొత్త కోర్సులు, ఇంక్యూబేషన్ కేంద్రాలు
- టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ), కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ) చేతులు కలిపాయి. రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా సంయుక్త కార్యాచరణను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్ఐ-ఎంఎస్ఎంఈ డైరెక్టర్ (ఎస్‌ఈడీ) శ్రీ కె. సూర్యప్రకాశ్ గౌడ్.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ సంయుక్త భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతిపాదిత నివేదికను సమర్పించారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
ఈ సందర్భంగా టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యా పాఠ్యాంశాల్లో కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ, ఎథిక్స్, అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థులకు బిజినెస్ పరిచయం, స్టార్టప్‌లు, లా గవర్నెన్స్-పాలసీ, అనుభవాత్మక అభ్యాసం వంటి మాడ్యూల్స్‌ను ప్రవేశపెట్టి, వాటికి తగిన అకడమిక్ క్రెడిట్లు కేటాయించాలన్నారు. తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు, రంగాల వారీగా ప్రాజెక్టులు, కేస్ స్టడీస్, ఫీల్డ్ వర్క్ ద్వారా విద్యార్థుల్లో ప్రాయోగిక నైపుణ్యాలు పెరుగుతాయని, దీనివల్ల వారు మరింత ఉత్సాహంగా పాల్గొంటారని వివరించారు. ఎన్ఐ-ఎంఎస్ఎంఈ డైరెక్టర్ సూర్యప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పారిశ్రామికతాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంత కళాశాలల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో కొత్త ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు జీవనోపాధి నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్‌లు లభిస్తాయన్నారు. జిల్లాస్థాయిలో పరిశ్రమల భాగస్వామ్యంతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించడంతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. అధ్యాపకుల నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని చెప్పారు.






