TG Venkatesh: తప్పుడు ప్రచారంతో రాష్ట్రాన్ని విభజించారు.. టీజీ వెంకటేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీపై టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG Venkatesh: తప్పుడు ప్రచారంతో రాష్ట్రాన్ని విభజించారు.. టీజీ వెంకటేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి (Revanth Reddy), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చొరవ తీసుకోవాలని, విభజన హామీలు అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు సహకరించాలని బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ (TG Venkatesh) విజ్ఞప్తి చేశారు.శుక్రవారం కర్నూల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నా అందులో ఏపీకి రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో ఎప్పటినుంచో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖతతో ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ (Telangana) ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని కానీ తప్పుడు ప్రచారంతో రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ సీఎం, మంత్రులతో పాటు మిగతా పార్టీలలోని లీడర్లంతా సమైక్యాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయత్వం వహించిన వారు. మీకు పరిస్థితులన్నీ తెలుసు. ఢిల్లీలో ఏపీకి గెస్ట్ హౌస్ లేదు. తెలంగాణనుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదు. కొన్ని ఆస్తులు ఉమ్మడిగానే ఉన్నాయి. ఇవేవి ఇంకా పరిష్కారం కాలేదు. భవిష్యత్ లో ప్రజలు ఘర్షణ లేకుండా ఉండాలంటే వీటికి పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణ విభజనకు నాటి సీఎం రోశయ్య మద్దతు తెలపలేదన్నారు. బీజేపీ, చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని, తదుపరి విషయాలేవి తనకు తెలియవని చెప్పారు.

Next Story