- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG TET Results: టెట్ ఫలితాల విడుదలపై అనిశ్చితి.. అసలు కారణం ఇదే!
టెట్ ఫలితాల (TET Results) కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టెట్ ఫలితాల (TET Results) కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫలితాల విడుదలపై అనిశ్చితి నెలకొంది. విద్యా శాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఉత్తర తెలంగాణ (North Telangana)లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) అమల్లో ఉండటంతో టెట్ ఫలితాల (TET Results) విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) అనుమతి తప్పనిసరి అయింది. ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదల కాగా కోడ్ కూడా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో నేడు అధికారులు టెట్ ఫలితాలను విడుదల చేస్తారా లేదా అన్న సందేహం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫలితాల విడుదల విషయంలో ఇప్పటికే విద్యా శాఖ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈసీ (EC) అనుమతిస్తే.. టెట్ ఫలితాలు (TET Results) విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఉత్తర తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. అదేవిధంగా మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ జగనుంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాగా, రాష్ట్రంలో జనవరి 2 నుంచి 20 వరకు విద్యా శాఖ టెట్ పరీక్షలను నిర్వహించింది. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్షకు హాజరయ్యారు. వారంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రిలిమినరీ కీ (Preliminary Key)లపై జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు విద్యా శాఖ అభ్యంతరాలను స్వీకరించింది. ఇక కేవలం తుది ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.






