- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: టెట్-2026 ఫలితాలు విడుదల
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET-2026) ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42,573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు అత్యధికంగా 90.27 శాతం మంది హాజరైనట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు కొనసాగాయి. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని ముందుగానే అధికారులు తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశముందని అంతా భావించినా.. అనుకున్న సమాయానికే ఫలితాలు విడుదల అయ్యాయి.






