- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్...ఇవాళ్టి నుంచి స్కూళ్లు ఓపెన్
వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో యథావిధిగా ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో యథావిధిగా ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూడా అధికారులు పంపిణీ చేయబోతున్నారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు వారం రోజులు కొనసాగనుంది. మరోవైపు మధ్యాహ్నం భోజనం పథకాన్ని సర్కార్ యథావిధిగా అమలు చేయనుంది. ఈ మేరకు మెనూ సామాగ్రిని పాఠశాలలను సిద్ధం చేసింది. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉండేలా చూడాలని దిశా నిర్దేశం చేసింది ఏపీ విద్యాశాఖ. అలాగే టీచర్లు కూడా విధులకు సకాలంలో హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొంది. కాగా తెలంగాణలో సోమవారం నుంచే స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి.
తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడంటే?
తల్లికి వందనం పథకాన్ని జూలై మొదటి వారంలో అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. గత ఏడాది జూన్ 12వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.13వేల చొప్పున జమ చేసింది సర్కార్. అయితే ఈ సారి కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యంగా అమలు చేయనున్నారట.






