Today's Horoscope:శుక్రుడి అనుగ్రహం ఆ రాశుల వారికే.. ఈ రోజు 12 రాశుల ఫలితాలు ఇలా!

by Jakkula.Mamatha |

గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేనందున, ఉద్యోగంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.

Todays Horoscope:శుక్రుడి అనుగ్రహం ఆ రాశుల వారికే.. ఈ రోజు 12 రాశుల ఫలితాలు ఇలా!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ క్రమంలో ఇవాళ(జూన్ 12) శుక్రవారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆఫీస్‌లో గత కొన్ని రోజులుగా ఉన్న పని ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. సహోద్యోగులు, పై అధికారుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడుల విషయంలో సాధారణ లాభాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని అనుగ్రహం వల్ల వృత్తి, వ్యాపారాలలో అనుకున్న పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. గతంలో ఆగిపోయిన పాత బాకీలు లేదా మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మిథున రాశి

ఉద్యోగస్తులకు పనుల్లో కొద్దిగా ఆటంకాలు లేదా జాప్యం జరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం వల్ల నష్టాల నుంచి బయటపడవచ్చు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచింది. అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది. మానసిక ఆందోళన లేదా ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. దైవచింతన లేదా ధ్యానం చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అదృష్టం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అవి విజయవంతం అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు గురించిన చర్చలు సానుకూలంగా సాగుతాయి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. భవిష్యత్తు కోసం చేసే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు అనుకూలం. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. అయితే, కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం పై కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది.

కన్య రాశి

ఈ రాశి వారు ఇవాళ పట్టుదలతో అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా చేసే దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తండ్రిగారి లేదా కుటుంబ పెద్దల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల పై ఆసక్తి పెరుగుతుంది.

తుల రాశి

గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేనందున, ఉద్యోగంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు, తిరిగి రావడం కష్టం కావచ్చు. మాట్లాడేటప్పుడు మాట తీరు పై నియంత్రణ అవసరం, లేకపోతే అనవసర వివాదాలు వచ్చే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అత్యంత లాభసాటిగా ఉంటుంది. భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడానికి అనుకూలమైన రోజు. సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రాబడి బాగుంటుంది. వైవాహిక జీవితం చాలా మధురంగా, సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం అందుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

ధనస్సు రాశి

ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు లేదా శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కోర్టు లేదా లీగల్ వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగానే ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. గత కొంతకాలంగా వేధిస్తున్న పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక దృఢత్వం, ఉత్సాహం పెరుగుతాయి.

మకర రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేధోపరమైన పనులు లేదా పరిశోధన రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా కళలు, మీడియా, క్రియేటివ్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్ మార్కెట్ లేదా లాటరీల వంటి రంగాల ద్వారా ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. సంతాన పరమైన విషయాలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. పాత స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.

కుంభ రాశి

రియల్ ఎస్టేట్, భూమి లేదా గృహ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వాహనం, బంగారం లేదా ఇంటికి కావలసిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం ఉన్నప్పటికీ, మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. సౌకర్యాలు పెరిగినప్పటికీ, మానసికంగా కొంత అలసటగా అనిపించవచ్చు. కంటి నిండా నిద్రపోవడం మంచిది.

మీన రాశి

ఈ రోజు కార్యాలయంలో మీ నిర్ణయాలకు మంచి విలువ ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు వ్యాపారపరంగా లాభదాయకంగా మారుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఈరోజు శుభప్రదం. ఆర్థిక స్థితి బాగుంటుంది. మిత్రులు లేదా తోబుట్టువుల నుండి ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. తోబుట్టువులతో, స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది, ఉత్సాహంగా ఉంటారు.

Next Story