మారని యాజమాన్య వైఖరి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడోసారి ప్రమాదం

by Ajay Maddhiboyina |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వ‌రుస ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. జూన్ 8న జరిగిన ఘోర ప్రమాదంలో 9మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరికొందరు కార్మికులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మారని యాజమాన్య వైఖరి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడోసారి ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వ‌రుస ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. జూన్ 8న జరిగిన ఘోర ప్రమాదంలో 9మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరికొందరు కార్మికులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరవకముందే గురువారం రెండుసార్లు ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుమాజున ఎస్ఎంఎస్ 1లో ల్యాడిల్ నుండి ఉక్కు ద్రవం లీక్ అయ్యింది. పూర్తిస్థాయి మరమత్తులు చేపట్టకుండానే పనులు ప్రారంభించడంతో అర్ధరాత్రి మరోసారి ఎస్ఎంఎస్ 1లో ప్రమాదం సంభవించింది. ఒకేరోజు రెండుసార్లు ప్రమాదాలు జరగడంతో యాజమాన్యం తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో మరమత్తులు చేపట్టిన తరవాతనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి ప్రమాదంలో తొమ్మిది మంది మరణించినా కూడా యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం ప్రమాదాలు జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే జూన్ 8న జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తామని, జీవితాంతం వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Next Story